సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఇంటింటా చెత్త సేకరణలో భాగంగా ప్రతి ఇంటికి చెత్త వాహనం వెళ్లి చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగాలనే ఉద్దేశ్యంతో రూ.63 లక్షల వ్యయంతో ఆరు డోర్ టూ డోర్ చెత్త వాహనాలను గురువారం మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల్లారా సిద్ధిపేట స్వచ్ఛ ఉద్యమంలో భాగస్వామ్యం కండి అంటు మంత్రి పిలుపునిచ్చారు. సిద్ధిపేట స్వచ్ఛ ఉద్యమంలో మీ పాత్ర కీలకం. స్వచ్ఛ-శుద్ధిపేటకై ప్రతి ఒక్క పౌరుడు కదిలిరావాలి.. సిద్ధిపేట మున్సిపాలిటీ అంటే మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, సిబ్బంది వాళ్లదే కాదు ప్రజలుగా మీపై కూడా మున్సిపాలిటీపై పెద్ద గురుతర బాధ్యత ఉంది అన్నారు.
మీ బాధ్యతను గుర్తించి స్వచ్ఛ సిద్దిపేట కోసం నడుం బిగించండి. మీ ప్రజలందరీ భాగస్వామ్యంతో సిద్ధిపేటను స్వచ్ఛశుద్దిపేటగా సాధిద్దాం. ఇంటింటి చెత్త సేకరణకై మరింత మెరుగు కోసమే నా తాపాత్రయం అని తెలిపారు. పట్టణంలో పెరిగిన వార్డులు, పెరిగిన జనాభా దృష్ట్యా ఇప్పటికే ఉన్న చెత్త సేకరణ వాహనాలకు తోడుగా మరో ఆరు వాహనాలు ఏర్పాట్లు చేసి ఇవాళ ప్రారంభించుకున్నాం. మరో మూడు వాహనాల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ రమణాచారి మంత్రి ఆదేశించారు. అన్నీ వార్డుల్లో నుంచి ప్రతి ఇంటికి చెత్త సేకరణ వాహనం వెళ్లి ప్రజలకు చేరాలన్నదే మా లక్ష్యం. ప్రజల సహకారం ఉంటే ఏదైనా సాధ్యమే.. తడి,సిద్ధిపేట స్వచ్ఛ ఉద్యమంలో ప్రతి పౌరుడు నడిచివచ్చి భాగస్వామ్యం కావాలని సిద్ధిపేట ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి హరీష్.
పొడి, హానికర చెత్తను వేర్వేరుగా చేసి మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి అందివ్వాలి. పట్టణంలో పెరుగుతున్న జనాభా, పెరిగిన వార్డులకు అనుగుణంగా చెత్త సేకరణ వాహనాల సంఖ్య పెంచడం జరిగిందని, ఇక ప్రతి ఇంటికి చెత్త వాహనం వస్తుంది. సిద్దిపేటలోని స్వచ్చ బడిని సద్వినియోగం చేసుకుందాం. ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తను ఎలా ఎరువుగా మార్చాలో స్వచ్ఛ బడిలో వివరిస్తారు. పట్టణంలోని ప్రతి ఒక్క పౌరుడు స్వచ్ఛబడిని సందర్శించాలి. ఇంటింట్లి పాది వెళ్లి స్వచ్ఛబడి చూసిరండి.వార్డుల వారీగా బ్యాచ్ ల వారీగా స్వచ్ఛబడికి వెళ్లాలని, ఇందుకోసం మున్సిపల్ ఆధ్వర్యంలో వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, వైస్ ఛైర్మన్ కనకరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, కమిషనర్ రమణాచారి, సుడా డైరెక్టర్ వేణుగోపాల్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.