ఎడ్యుకేషన్ హబ్ గా పటాన్ చెరుః మంత్రి హరీశ్ రావు

424
Harish Rao
- Advertisement -

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆలోచనతో పటాన్ చెరులో ఎడ్యుకేషన్ హబ్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు. పఠాన్ చేరు పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల పాఠశాలను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పాల్గొన్న జడ్పీ చైర్మన్ మంజు శ్రీ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పలువురు అధికారులు పాల్గోన్నారు.

ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆలోచనతో పటాన్ చెరులో ఎడ్యుకేషన్ హబ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎడ్యుకేషన్ హబ్ లోని ఇంటర్,డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ప్రారంభిస్తాం..వందశాతం ఫలితాలు సాధించాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్ధులకు విలువలతో కూడిన విద్యను అందించాలని కోరారు. రూ.3 కోట్ల 65 లక్షల తో పఠాన్ చేరు లో ప్రభుత్వ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభం చేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ పెద్దమనసుతో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ఆదుకున్నట్లు తెలిపారు. మరోవైపు పటాన్ చెరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేసినట్లు తెలిపారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో పఠాన్ చెరులో ఎడ్యుకేషన్ హబ్ ను నిర్మించుకున్నట్లు తెలిపారు.

ఈసందర్భంగా స్ధానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన సొంత నిధులతో 11వేల మంది విద్యార్ధులకు డిక్షనరీలు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పంపిణి చేశారు. అంతేకాకుండా 6వేల మంది 10తరగతి విద్యార్దులకు పరీక్షల పాడ్స్ ను అందజేశారు.

- Advertisement -