డబుల్ బెడ్ రూం ఇండ్లు ప్రారంభించిన మంత్రి హరీష్‌..

214
harish rao
- Advertisement -

కేసిఆర్ నగర్‌లో 2,460 ఇండ్ల గృహ సముదాయం నిర్మాణంను అన్నీ వసతులతో పూర్తి చేసేందుకు తాను స్థానిక కౌన్సిలర్ లు, అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో రెండు ఏండ్లలో 400 పైగా పర్యటించానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆదివారం సిద్దిపేట కేసిఆర్ నగర్ ఆడిటోరియంలో 8వ వార్డు నర్సా పూర్ కాలనీలో నాలుగో దఫా 168 మంది డబుల్ బెడ్ రూం ఇండ్లును లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు పట్టాల పంపిణీ చేశారు.

అంతకు ముందు మంత్రి లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది అనాదిగా వస్తున్న నానుడి అని మంత్రి తెలిపారు. జీవితంలో ప్రధాన మైన ఈ రెండు అంశాలును పూర్తి చేసేందుకు చాలా కష్టంతో కూడుకున్నదని దీని అర్థం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల ఇల్లు, పెళ్లికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అంది స్తుందన్నారు. రూపాయి ఖర్చు లేకుండా, చెమట చుక్క చిందించ కుండా గూడు లేని నిరుపేదలుకు ప్రభుత్వం రెండు పడక గదుల ఇండ్లను నిర్మించి ఇస్తుందన్నారు. కేసిఆర్ నగర్‌లో పెద్దల గేటెడ్ కమ్యూనిటీ ఇండ్ల మాదిరి అన్ని సౌకర్యాలుతో కూడిన డబుల్ బెడ్ రూం ఇండ్లను గూడు లేని అసలైన గరీబొల్లకే కేటాయించామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

నిరుపేదల స్వంతింటి కలను నిజం కాబోతున్న అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులతో… నర్సాపూర్‌లో 2460 రెండు పడక గదుల ఇల్లు నిర్మాణం సకల సౌకర్యాలతో ప్రైవేట్ ఇండ్ల సముదాయాలకు ధీటుగా పూర్తి చేశామన్నారు. ఈ ఇళ్ళు నిర్మించేందుకు మాకు రెండేండ్లకు పైగా సమయం పట్టిందని మంత్రి తెలిపారు.ఈ రెండేండ్లలో నాలుగు వందల సార్లు జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్‌లతో కలిసి నిర్మాణ స్థలాన్ని సందర్శించి స్వంత ఇంటి మాదిరి మనసు పెట్టీ ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. మొదటి దశలో 1341 మంది లబ్ధిదారులను గుర్తించామనీ మంత్రి తెలిపారు. నిజమైన పేదలకు ఇల్లు దక్కాలని ఆరు నెలలు కష్టపడి జల్లెడ పట్టి ఏలాంటి ఆరోపణలకు తావులేకుండా పేదరికమే ప్రామాణికంగా అర్హులను మాత్రమే ఎంపిక చేశామన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని బాజప్తా వార్డు గోడలపై లబ్దిదారుల జాబితా ప్రదర్శించసమన్నారు.

కేటాయింపు రాజకీయ జోక్యం లేకుండా జాగ్రత్త లు తీసుకున్నామన్నారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు స్థానిక కౌన్సిలర్ లు సహకరించారన్నారు. నయా పైసా ఖర్చు లేకుండా ఒక్క పైసా లంచం లేకుండా ఇండ్ల కేటాయింపు జరిపామన్నారు. ఎవరైనా ఒక్క పైసా లంచం ఇచ్చినట్టు చెప్పండి.. వారికి రూ.10 వేల బహుమానం ఇస్తానని మంత్రి తెలిపారు. ప్రతిగా లబ్దిదారులు స్పందిస్తూ తమను ఎవ్వరూ ఒక్క పైసా లంచం అడగలేదని..ఇవ్వలేదని తెలిపారు. మంత్రి హరీష్ రావు తన ప్రసంగం ను కొనసాగిస్తూ..తోలి దశలో ముఖ్యమంత్రి సమక్షంలో 144 మంది లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు చేశారన్నారు. రెండో దశలో 180 మందికి, మూడో దఫా లో 216 మందికి పట్టాలు పంపిణీ చేశామన్నారు.

ప్రతీ ఇంట్లో గృహ విద్యుత్, నల్లా, గ్యాస్ కనెక్షన్, పైపులు అన్ని సక్రమంగా పని చేస్తున్నా యో లేదో సరి చూసుకుంటూ దశల వారీగా లబ్ధిదారుల కు పట్టాలు అందిస్తూ గృహ ప్రవేశాలు జరిగేలా చూస్తున్నా మన్నారు. ఇంకా మిగిలిన 1000 ఇండ్లకు సంబంధించి పున: పరిశీలన ప్రక్రియ జరుగుతుందని వారిలో అర్హులైన వారికి త్వరలోనే రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఏ ఒక్క నిరుపేదకు అన్యాయం జరగకూడదన్న ధ్యేయంతో సాంకేతికత దన్నుగా బిగ్ డేటా తో సరిపోల్చు తూ…అర్హులకే మాత్రమే లబ్ది పొందేలా చూస్తున్నా మన్నారు. మరో 1000 ఇండ్లు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేయగా వెంటనే మంజూరు చేశారన్నారు. లబ్ధిదారులకు పట్టాలు అందజేసే సమయంలోనే…. పట్టా ఉత్తర్వు తో పాటు..నల్లా కనెక్షన్ మంజూరు పత్రం, కరెంట్ కనెక్షన్ , ఇంటి నెంబర్, పైపుడ్ గ్యాస్ కనెక్షన్ లు అందజే స్తున్నామన్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థతో కేసిఆర్ నగర్ ను అనుసంధానం చేశామన్నారు. ఫలితంగా ఉపరితల మురుగు కాల్వలు ఉండవన్నారు. దోమలు, పందుల బెడద తప్పి..అనారోగ్యం దరి చేర ద న్నారు.

అంతే కాకుండా స్వంత అన్నయ్య లా ఆశీర్వదిస్తూ…నూతన వస్త్రాలు బహుకరించి గృహ ప్రవేశాలు చేపిస్తున్నామన్నారు. కేటాయించిన పక్కా ఇండ్లను పది కాలాల పాటు కాపాడు కోవాల్సిన బాధ్యతల లబ్ధిదారుల దేనన్నారు. ఇండ్లను కిరాయికి ఇచ్చినా, అమ్ముకున్నా నేరమని తిరిగి స్వాధీనం చేసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల విజ్ఞప్తి మేరకుకేసిఆర్ నగర్ కు ప్రతి రోజు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించా మన్నారు. బస్సు సౌకర్యం ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రూ. 25 లక్షలతో పోలీస్ పోస్ట్ కూడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే కేసిఆర్ నగర్ కు బస్తీ దవాఖానా వచ్చే వరకు ఒక anm, ఆశ వర్కర్ తో తాత్కాలిక ప్రాథమిక చికిత్స కేంద్రం ఏర్పాటు చేశా మన్నా రు. వీటితో పాటు త్వరలోనే కేసిఆర్ నగర్ కు బడి, రేషన్ షాప్, గుడి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. లబ్దిదారులు గృహ సముదాయంలో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలన్నారు.

- Advertisement -