సంగారెడ్డిలో దళితుల స్వయం ఉపాధికి ఆర్ధిక సాయం అందించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. శనివారం సంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ గిరిజన లా కాలేజీని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బి.బి. పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొన్నారు.
మంత్రి హరీష్ రావు మాల్లాడుతూ.. జహీరాబాద్, ఆందోల్ నియోజకవర్గాలకు చెందిన దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజి ఇస్తాం అని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయింపులు 2899 కోట్లకు అదనంగా మరో వెయ్యి కోట్లు ఇచ్చారు. వీటిని దళితుల ఆర్ధిక అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు.
సీఎం దళిత అభివృద్ధి పథకంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 6వేల మందికి సాయం అందిస్తాం. ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల వచ్చింది. దళితులు తమ పిల్లలను గురుకుల పాఠశాలల్లో చేర్చి చదివించాలి. సొంత స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకునేందుకు ఆర్ధిక సాయం అందిస్తాం. ఇందుకోసం బడ్జెట్‌లో 11000 కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రి హరీష్ పేర్కొన్నారు..