కిషన్‌ రెడ్డి,బండి సంజయ్‌పై మంత్రి హరీష్‌ ఫైర్‌..

84
- Advertisement -

పెంచేటోడు బిజెపి వాడైతే… పంచే వారు తెరాస పార్టీ.. ఎవ్వరూ కావాలో…ప్రజలే తెల్చు కావాలి అని మంత్రి హరీష్‌ రావు సూచించారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం, నర్మేట గ్రామంలో ఈజీఎస్‌, సీఎస్‌ఆర్‌ నిధులు 2 కోట్ల రూపాయలతో నిర్మించిన పాడి పశువుల హాస్టల్, పాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. మట్టి పనుల్లో రూ.25 వేల కోట్ల రూపాయల కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వంను కిషన్ రెడ్డి నిలదీయాలి..తెలంగాణకు ఈజీఎస్‌ క్రింద ఈజీఎస్‌ కూలీలకు 3 వేల కోట్ల పనిదినాలను తగ్గించడంపై కేంద్రాన్ని కిషన్‌ రెడ్డి ప్రశ్నించాలి అని మంత్రి డిమాండ్‌ చేశారు. కూలీలపై ప్రేమ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్టు రాష్ట్రంలో పనిదినాలను 13 వేల కోట్ల నుండి 16 వేల కోట్లకు పెంచేలా చూడాలి అన్నారు.

అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టి కొట్టి..సిగ్గు లేకుండా పాద యాత్రలు చేస్తారా అని బండి సంజయ్‌ని సూటి ప్రశ్శించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్ లు పెంచకుండా తొక్కి పెట్టినందుకా.. వడ్ల కొననందుకా, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి నందుకా, వంట గ్యాస్ ధర మంట పెట్టినందుకా, నిరుద్యోగులకు జాబ్ లు ఇవ్వనందుకా, ఎరువుల ధరలు విపరీతంగా పెంచినందుకా… ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో.. ముందు స్పష్టత ఇచ్చాకే పాదయాత్ర చేపట్టాలి అని మంత్రి హరీష్‌ డిమాండ్‌ చేశారు.

అలా కాకుండా పాదయాత్రలు చేస్తే తెలంగాణ ప్రజలు దంచి కొడతారు..ప్రజల ఆకాంక్షల నుంచి, వారి ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ తెరాస. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కేసిఆర్ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతామన్నారు. పెంచేటోడు బిజెపి వాడైతే… పంచే వారు తెరాస పార్టీ. ఎవ్వరూ కావాలో…ప్రజలే తెల్చు కావాలి అని సూచించారు. ఈ అంశాలపై గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు విస్తృతంగా చర్చించాలి. సమైక్య రాష్ట్రంలో ఏకాలం చూసిన ఎండా కాలమే…స్వరాష్ట్రం లో ఏకాలం చూసిన వానాకాలం లాగే ఉందని మంత్రి హారీష్‌ వ్యాఖ్యానించారు.

- Advertisement -