కాంగ్రెస్ అంటే గతం.. మంత్రి హరీశ్‌ ఫైర్‌..

38
Minister Harish Rao
- Advertisement -

గురువారం పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి అమీర్ పేట్‌లో 50 పడకల ఆసుపత్రి సందర్శించారు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గీతారెడ్డి, జగ్గారెడ్డి కళ్లు ఉండి లేనట్లు మాట్లాడుతున్నారు. వాళ్ల హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దావాఖానా అని పాడేవారు. ఇప్పుడు సర్కారు ఆసుపత్రికే పోతా అని అంటున్నారు. గీతారెడ్డి డాక్టర్ అయ్యు ఉండి ఇలా మాట్లాడటం తగదు. జగ్గారెడ్డి సంగారెడ్డి ఆసుపత్రి వెళ్లి అభినందించారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మీ పక్కనే ఉన్నారు అడగండి అని మంత్రి వ్యాఖ్యనించారు.

కరోనా సమయంలో సీఎం గాంధీలో తిరిగి ధైర్యం నింపారు. ఉస్మానియ వెళ్లి 200 కోట్లు విడుదల చేశారు. కోర్టుకు వెళ్లారు కొందరు. ఢిల్లీ ఆసుపత్రి వెళ్తే విమర్శించారు. మంచి ఎక్కడ ఉన్నా తీసుకుంటాము. మీ హయాంలో జిల్లా మెడికల్ కాలేజీ పెట్టాలని సోయి ఉందా అని ప్రశ్నించారు. 70 ఏళ్లల్లో 3 మెడికల్ కాలేజీలు ఉంటే, 7 ఏళ్లలో 33 కాలేజీలు ఏర్పాటు చేశాము. కాలేజీలు పెడితే ఎందుకు పిల్లలు ఉక్రెయిన్, చైనా వెళ్లారు. కాంగ్రెస్ అంటే ఏసీ కార్లలో ఉంటారు. మేము బస్తీల్లో ఉంటాము అన్నారు. కాంగ్రెస్ అంటే గతం.. ప్రస్తుతం ఆగమాగం. ఒక లీడర్ కు మరొక లీడర్ కు మాటలకు పొంతన ఉండదు. కాంగ్రెస్ మాటల పార్టీ,టీఆర్‌ఎస్‌ చేతల పార్టీ అన్నారు. నాడు వానాకాలంలో ఏజెన్సీలు మంచం పట్టెవి ఇప్పుడు ఉన్నాయా.!? అని ప్రశ్నించారు మంత్రి హరీశ్‌.

మీ జహీరాబాద్ ఆసుపత్రి చూడు.. ఏమేమెం చేశామో.! కాంగ్రెస్ నాయకులకు సర్కారు దవాఖానలో విమర్శించే హక్కు లేదు అని విమర్శించారు. 2014లో 17000 పడకలు, 27 వేల పడకలు ఏర్పాటు చేశాం. ఇది కాదా అభివృద్ధి.. మీ పాలన కంటే మా హయంలో ఆసుపత్రులు బాగు చేశాం. 15 లక్షల కాన్పులు చేశాము. 1500 కోట్లు అదనంగా నిధులు విడుదల చేశాం. కోటి 50 లక్షల మందికి కళ్ళ పరీక్ష చేశాం. ఆరోగ్య శ్రీ గురించి మాట్లాడారు.. మేము 2 నుండి 5 లక్షలకు పెంచాను. 3.60 లక్షల మంది సేవలు పొందారు. 850 కోట్లు ఖర్చు పెట్టారు. లిస్ట్ పంపిస్తా వెళ్లి అడగండి అని మంత్రి అన్నారు. రండి సర్కార్ దావాఖానాలు ఎలా ఉన్నాయో.! చూడండీ అని మంత్రి తెలపారు.

మేము రోజూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటున్నాం. కళ్ళు ఉండి చూడలేని కబోధిల్లా ఉంది మీ వ్యవహారం.కేంద్ర ప్రభుత్వం, నీటి అయోగ చెప్పయీ. మనం దేశంలో మూడో స్థానంలో ఉన్నాము. ఎంఎంఅర్ గణనీయంగా తగ్గింది 56 కి తగ్గించాం. తమిళనాడును దాటాము. ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాలని ఆలోచన ఉందా మీకు. మేము నాలుగు టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నాం. హైదరబాద్ లోనే 6000 సూపర్ స్పెషాలిటీ పడకలు రాబోతున్నాయని మంత్రి హరీశ్‌ పేర్కొన్నారు.

- Advertisement -