తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష.. మంత్రి హరీష్‌ ఫైర్‌..

75
- Advertisement -

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిందంటూ.. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక,ఆరోగ్య శాఖల మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ… 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదని కేంద్రాన్ని విమర్శించారు.. ఒక్కో కాలేజీకి 200 కోట్లు మంజూరు చేసిన కేంద్రం… తెలంగాణకు మొండి చేయి చూపిందని ధ్వజమెత్తారు. వైద్యారోగ్య రంగాన్ని ఉమ్మడి పాలకులు నిర్లక్యం చేశారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 3 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్యను 33కి పెంచుకుంటున్నామని మంత్రి తెలిపారు.

ఉక్రెయిన్ వెళ్లిన మన విద్యార్థుల బాధలు వర్ణనాతీతమన్నారు. గత పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపించారు. వైద్య విద్య కోసం భాష రాకపోయినా ఉక్రెయిన్, చైనా తదితర దేశాలకు వెళ్లి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నందు వల్ల విద్యార్థులు ఇక్కడే వైద్య విద్యను చదువుకోవడం సాధ్యం కానున్నదని చెప్పుకొచ్చారు మంత్రి హరీష్‌.

- Advertisement -