కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణి చేసిన మంత్రి హరీశ్ రావు

294
Harish Rao Gives Kalyana Lakshmi Cheqes

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణి చేశారు ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌ రావు, జెడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇవాళ ఒక్కరోజే 7 వందల 67 మందికి 7 కోట్ల 9 లక్షల రూపాయల కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసాము. ఇలాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ను చూసి మహారాష్ట్రలోని తెలంగాణకు అనుకోని ఉన్న గ్రామాల ప్రజలు మా గ్రామాలను తెలంగాణలో కలుపుకొమ్మని అంటున్నారు. ఈ రోజు ఢిల్లీ ప్రజలు గాలి సీసాలు కొని పీల్చుకొనే పరిస్థితి వచ్చింది .మనకు ఆ పరిస్థితి రావద్దు అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చెట్లను ప్రతి ఇంట్లో నాటి హరిత తెలంగాణ సాధించుకుందాం అన్నారు. క్యాన్సర్ ను నివారించాలంటే ప్లాస్టిక్ వస్తువులను నిషేదించాలన్నారు.

Minister Harish Rao Distributes Kalyana Laxmi And Shadi Mubarak Cheqes