సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణి చేశారు ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు, జెడ్పీ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇవాళ ఒక్కరోజే 7 వందల 67 మందికి 7 కోట్ల 9 లక్షల రూపాయల కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసాము. ఇలాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ను చూసి మహారాష్ట్రలోని తెలంగాణకు అనుకోని ఉన్న గ్రామాల ప్రజలు మా గ్రామాలను తెలంగాణలో కలుపుకొమ్మని అంటున్నారు. ఈ రోజు ఢిల్లీ ప్రజలు గాలి సీసాలు కొని పీల్చుకొనే పరిస్థితి వచ్చింది .మనకు ఆ పరిస్థితి రావద్దు అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చెట్లను ప్రతి ఇంట్లో నాటి హరిత తెలంగాణ సాధించుకుందాం అన్నారు. క్యాన్సర్ ను నివారించాలంటే ప్లాస్టిక్ వస్తువులను నిషేదించాలన్నారు.
Minister Harish Rao Distributes Kalyana Laxmi And Shadi Mubarak Cheqes