వచ్చే సంవత్సరం బతుకమ్మలను కాళేశ్వరంలో నీళ్లలో నిమజ్జనం చేస్తామని చెప్పారు మంత్రి హరీష్ రావు. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆడపడచులకు చీరల పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా గజ్వేల్ పట్టణంలో స్ధానిక మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటగా బతుకమ్మ చీరల పంపిణిని గజ్వేల్లో ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది.
సిద్దిపేట జిల్లాలో మొత్తం 3లక్షల 65వేల పైచిలుకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పేద మహిళలకు ఉచితంగా బట్టలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం వచ్చిన కళ్యాణ లక్ష్మీ, ఆసరా పెన్షన్ల పథకాల్లో కోత లేకుండా ఇస్తున్నాం అని చెప్పారు. కాంగ్రెస్ , టీడీపీ ప్రభుత్వాలు ఉంటే మనకు నీళ్లు వచ్చేవా? నూట యాబై కిలోమీటర్ల నుండి నీళ్లు తెచ్చి ఆడపడుచుల కష్టాలు తీర్చిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. భారత దేశంలో 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.