సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలో లాక్ డౌన్ నేపధ్యంలోవ్ 300 మంది నిరుపేద కుటుంబాలకు ,జర్నలిస్టులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, జడ్పి చైర్మన్ మంజూశ్రీ, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్యెల్యే క్రాంతి కిరణ్, కోపరేటివ్ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మార్క్ ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కరోనా వ్యాధి లాంటి ఇలాంటి విషయం ఎప్పుడు వినలేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ముందస్తుగా మే నెలలో కూడా విజృభించే పరిస్థితి ఉందని అందరు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలకు సూచనలు చేసారు.
వ్యాధి లక్షణాలు లేకుండా మనిషి లోపల కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయి. అందుకే అందరూ రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి.కరోనా కష్ట కాలంలో ప్రజలందరినీ ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారు. ఈ నెలలో కూడా 12 కిలోల బియ్యంతో పాటు 1500 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు జలుబు, దగ్గు వచ్చిన డాక్టర్ ను సంప్రదించండి. ప్రతి నాయకుడు ప్రజలను ఆదుకోవాలి. క్రాంతి కిరణ్ జర్నలిస్ట్ కనుక జర్నలిస్టులకు అండగా ఉంటూ వారి బాధలను తన బాధగా అనుకోని జర్నలిస్టులకు సహకారం చేస్తు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కృషిచేస్తుంది. డాక్టర్లు పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు సమాజ బాగుకోసం నిత్యం కష్టపడుతున్నారు.ప్రతి ఒక్కరు ఇంట్లో వుండి ఎదో ఒక పని చేసుకోవాలి. బయటకు మాత్రం రాకండి. అమెరికాలో ఇటలీలో సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లే అక్కడ చాలా మంది మృత్యువాత పడుతున్నారు.అలాంటి పరిస్థితి మన దగ్గర తెచ్చుకోవొద్దు. ఎవరైనా కొత్త మనిషి ఊర్లకు వస్తే ప్రభుత్వ అధికారులకు గ్రామస్తులు తెలియజేయండి అని మంత్రి హరీష్ ప్రజలకు సూచించారు.