HarishRao:పోడు పట్టాలను పంచిన మంత్రి..

41
- Advertisement -

రాష్ట్రంలో నేడు చారిత్రాత్మకమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదివాసీలకు సొంతభూమి లేదనే భాద ఇక నుంచి కలగదు. ఏండ్ల తరబడి అడవినే నమ్ముకున్న అడవి బిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. సమైక్య పాలనలో పోడు పట్టాలు లేక గోసలు పడ్డ గిరిజన బిడ్డలకు సీఎం కేసీఆర్‌ పట్టాలు అందుకుంటున్నారు.

ఖమ్మం జిల్లా పాల్వంచలోని సుగుణ ఫంక్షన్‌ హాల్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి పోడు పట్టాలను గిరిజన రైతులకు పంపిణీ చేశారు. అనంతరం అక్కడ జరిగిన పబ్లిక్ మీటింగ్‌ మాట్లాడారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 13139ఎకరాలు సాగు చేసుకుంటున్న 6589మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయనున్నారు.

Also Read: ప్రజల్లో చైతన్యం నింపిన సాయిచంద్..

తెలంగాణ ఏర్పడి కేసీఆర్‌ సీఎం అయ్యాక పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. అధ్యయనానికి సబ్‌ కమిటీ వేశారు. మూడంచెల సర్వే నిర్వహించారు. వాస్తవ స్థితిగతుల ఆధారంగా మార్గదర్శకాలు రూపొందించారు. జీవో 140 ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. సమైక్య పాలనలో 2008 నుంచి 2012 వరకు అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 24 వేల మందికి మాత్రమే పట్టాలు మాత్రమే ఇచ్చారు. కానీ తెలంగాణ ప్రభుత్వం 57,184 మందికి పట్టాలు అందించనుండడమే గాక రైతుబంధు, రైతుబీమా పథకాలనూ అమలు చేయనుంది.

Also Read: KTR:కుమ్రం భీం కలలను సాకారం చేసిన నేత కేసీఆర్

- Advertisement -