కుటుంబ వ్యవస్థకు పునాది పెళ్లిః మంత్రి హరీశ్ రావు

544
harishrao
- Advertisement -

కుటుంబ వ్యవస్ధకు పునాది వివాహం అన్నారు మంత్రి హరీష్ రావు. ఎంజేఆర్ ఛారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వరంలో నిర్వహించిన సామూహిక వివాహా వేడుకలకు మంత్రి హరీశ్ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని జెడ్పి మైదానంలో ఈ కళ్యాణ మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఒకే ముహుర్తంలో 165జంటలు ఒక్కటయ్యాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి 2012సంవత్సరం నుంచి ప్రతి ఏడాది సామూహిక వివాహలు జరిపిస్తున్నారు.

 harishrao

ఈ రోజు వివాహం చేసుకున్న జంటలకు ఎమ్మెల్యే మర్రి జానార్ధన్ రెడ్డి కళ్యాణలక్ష్మీతో పాటు అన్నీ రాకాలుగా ఆర్ధిక సాయం చేయనున్నారు. ఈసందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘ఆడపిల్లల పెళ్లంటే ఎంత కష్టమో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసు. అందుకే కల్యాణ లక్ష్మీ పథకం తీసుకొచ్చారు. మంచి పనికి భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయన్నారు. ఈకార్యక్రమంలో మెదక్ ఎంపీతో పాటు జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.

- Advertisement -