బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పటల్ 22 వ వార్షిక వేడుకలు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఎంపీ నామానాగేశ్వర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…సినిమా రంగంలో,సేవ రంగంలో,రాజకీయ రంగంలో బాలకృష్ణ రాణిస్తున్నారు. వారి నాన్నగారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూనే ..తనకంటూ ఒక్క ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్ టి ఆర్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కి చాలా అభిమానం. చాలా సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మేము ఈ ఆసుపత్రి గురించి మాట్లాడుకునే వాళ్ళం అని వివరించారు.
చాలా సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేషెంట్ అటెండర్లు బయట నిద్రపోతున్నారు అని చాలా బాధపడ్దారు. పేషెంట్స్ అటెండర్ కోసం బిల్డింగ్ కట్టమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆయన చెప్పగానే బాలకృష్ణ కట్టారు. నలుగురు ముఖ్యమంత్రులు చేయలేని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. ఈ ఆసుపత్రి కి బిల్డింగ్ రేగ్యాలరేషన్ కిందా 6 కోట్ల రూపాయలను మాఫీ చేశారు అని తెలిపారు.
చెడు ఆహార అలవాట్లు పెరగడం వలన కాన్సర్ పెరుగుతుంది,ఇది చాలా దురదృష్టకరం అని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో కాన్సర్ పైన ఫోకస్ చేస్తున్నాం, దీనిలో బాగంగా హెల్త్ ప్రొఫైల్ ద్వారా,టి డయాగ్నొస్టిక్ ద్వారా ప్రజలకు స్క్రీనింగ్ చేస్తున్నాం,ఎమ్ ఎన్ జె కాన్సర్ అసుపత్రి ని 750 బెడ్స్ కి అప్గ్రేడ్ చేస్తున్నాం మరియు ఎమ్ ఎన్ జె లో కూడా 8 మోడలర్ థియేటర్స్ కడుతున్నాం,రోబోటిక్ థియేటర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం,గాంధీ ఆసుపత్రిలో కూడా కాన్సర్ వార్డ్ తీసుకొని రావాలని నిర్ణయించడం జరిగింది అని పేర్కొన్నారు.
బసవతారకం అసుపత్రి ఉండడం తెలుగు వారి అదృష్టం. నీతిఅయోగ్ కూడా బసవతారకం ఆసుపత్రి ని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం రీసెర్చ్ కు పెద్దపీటవేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం హెల్త్ టూరిజం లో కూడా పేరుగాంచింది. మా సంపూర్ణమైన సహాయసహకారాలు వైద్యారోగ్య రంగం అభివృద్దికి అందిస్తాం. వైద్యారోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి కేసీఆర్ హెల్త్ కి బడ్జెట్ పెంచారు అని వివరించారు.
ఈ కార్యక్రమంలో హీరో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ…ఈ ఆసుపత్రిని మా అమ్మగారి కోరిక మెరుకు నిర్మించారు. ఈ ఆసుపత్రికి ఎంతో మంది దాతలు సహాయం అందించారు. వారందరికి ప్రత్యేక ధన్యవాదాలు. కాన్సర్ అనేది మానసికంగా చంపేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో మంత్రి హరీష్ రావు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బిల్డింగ్ రేగ్యాలరేషన్ కిందా 6 కోట్ల రూపాయలను మాఫీ చేశారు వారికి ధన్యవాదాలు. చరిత్రలో ఎవరు ఇలాంటి సహాయం చేయలేదు. రెండు రాష్ట్రాల నిమ్స్ తరవాత ఎక్కువ పేషెంట్స్ ని ట్రీట్ చేస్తున్న అసుపత్రి బసవ తారకం అని పేర్కొన్నారు.