సిద్దిపేటలో ఒక్కరికీ కూడా కరోనా రాలేదు..

274
harish minister
- Advertisement -

సిద్దిపేట జిల్లా మార్కెట్ యార్డులో పని చేసే 500 మంది హామాలీలకు సుధా, నారాయణ మూర్తి సహకారంతో నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, హాస్య నటుడు శివారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కరోనా అనే కొత్త రోగం ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. మనుషులు ఇండ్లలో ఉంటే జంతువులు రోడ్లపై ఆడుతున్నాయి. కరోనా రోగానికి మందు లేదు. కరోనా కి మందు అంటే ఎవరి ఇండ్లలో వారు ఉండడమే అని మంత్రి అన్నారు.

Minister Harish Rao

సీఎం కెసిఆర్ ప్రజలను ఎక్కడి వారిని అక్కడే ఉండమని సూచిస్తున్నారు. మన దేశం, మన రాష్ట్రం ఇప్పటికీ సెప్ జోన్ లోనే ఉన్నది. అమెరికా, ఇటలీ దేశాల్లో శవాలు గుట్టల్ల పెరుతున్నాయి. కరోనాతో చనిపోయిన శవం దగ్గరకు కన్నా వాళ్ళు, కట్టుకున్నవాళ్లు పోని పరిస్థితి నెలకొంది. మనిషిని మనిషి తాకితే ఈ రోగం వస్తుంది. అవసరమైతే తప్ప బయటకు ఎవరు రావద్దు. కొద్దిరోజులు ఓపిక పడితే ఈ రోగం బాధ తప్పుతుంది.

సింగపూర్ వంటి దేశం నెల రోజుల లాక్ డౌన్ పాటిస్తుంది. మనకు అలాంటి పరిస్థితి రావద్దు అంటే ఇంట్లోనే ఉండాలి. మర్కాజ్ మీటింగ్ పోయి వచ్చిన వాళ్ళని అందరికీ పరీక్షలు నిర్వహించాం. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి కానీ రోగాన్ని కొని తెచ్చుకోకండి.సిద్దిపేటలో ఒక్కరికీ కూడా కరోనా రాలేదు. కరోనా కు కులం, మతం, చిన్నా, పెద్ద లేదు, ఇది సెక్యులర్ వైరస్. స్పెయిన్ రాణి కరోనా రోగం తో చనిపోయింది. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, పాటించాలన్నారు మంత్రి హరీష్‌.

- Advertisement -