బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నా చేయాలి:గంగుల

110
gangula
- Advertisement -

రాష్ట్రం ప్రభుత్వం ఓవైపు ధాన్యం కొంటుంటే.. బీజేపీ నేతలు ధర్నాల పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు మంత్రి గంగుల కమలాకర్. బీజేపీ నేతలు రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన గంగుల…రైతులు పండించే వానాకాలం పంట ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు.

ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 6,663 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివకే 5.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని బీజేపీ నేతలకు సూచించారు. ఆ పార్టీ నేతలు అబద్ధాలు చెప్పి బతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. యాసంగి పంట మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ధాన్యం కొంటదా.. కొనదా? కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -