ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిశుభ్రత పాటించాలిఃమంత్రి గంగుల‌

215
- Advertisement -

ప్ర‌తీ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిశుభ్రత పాటించాల‌ని ఆదేశించారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్. హైదరాబాద్ లోని మంత్రి పేషీలో అధికారులు ,రైస్ మిల్లర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈసంద‌ర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. కరోనా వైరస్ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిశుభ్రత పాటించడం తో పాటు మంచి నీరు, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అలాగే ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచాలని, కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా వర్షాకాలం సీజన్ ప్రారంభానికి ముందు అకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నందున వరి ధాన్యం తడవకుండా ఉండెందుకు టార్ఫాలిన్ ను అందుబాటులో ఉంచాలని ఆయన అన్నారు.

ముఖ్యంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించే ఏర్పాట్లు చేయాలని అన్నారు. అన్ని గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే కొనుగోలు చేసి సాధ్యమైనంత వరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆయా గ్రామాల్లోనే నిలువ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని, ధాన్యం కొనుగోలు సందర్బంలో ఎక్కువ మంది వచ్చిన సందర్భంలో దూరం దూరం పాటిస్తూ రెండేసి కాంటాలు ఏర్పాటు చేసి తూకం వేయాలని ఆయన అధికారులకు సూచించారు. అంతేగాక రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం రైతుల పూర్తి వివరాలు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా రిజిష్టర్లలో నమోదు చేయాలని ఆయన అన్నారు.

- Advertisement -