రెమిడెసివిర్ ఇతర అత్యవసర మందుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ ఈ రోజు కరీంనగర్‌లో ఉన్నతాదికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రైవేట్ హాస్పిటల్లు ప్రస్థుత కరోనా సంక్షోబంలో మానవతా ద్రుక్పథంతో వైద్యం అందించాలి. ప్రైవేట్ హాస్పిటళ్లకు సరఫరా అయిన రెమిడెసివీర్, ఇతర మందుల్ని ఏ పేషంట్లకు, ఎప్పుడు, ఎన్ని మెతాదులు వాడారో పక్కాగా లెక్కలు నిర్వహించాలని అన్నారు. వీటిని ఎప్పటికప్పుడు ప్రభుత్వాధికారుల ప్రత్యేక తనిఖీల ద్వారా పర్యవేక్షిస్తారు.
ఇందుకోసం అవసరమైన సిబ్బందితో రెండ్రోజుల్లో పటిష్ట కార్యాచరణ రూపొందిస్తాం, ఏ ఒక్క హాస్పిటల్ కాని, వైద్యులు లేదా ఇతర సిబ్బంది కానీ అక్రమంగా వీటిని నిల్వచేసినా, ఎక్కువ ధరలకు అమ్ముకున్నా కఠిన చర్యలు తీసుకుంటాం. అత్యవసరం కోసం మినిమం ధరల్లో అందుబాటులో ఉంచాలి. ప్రస్థుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యంతో ఎవరూ అటలాడుకోవద్దు, సామాన్య ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం, ఇందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడము. అత్యవసర మందుల సరఫరా కోసం ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడాము, ఫార్మా సంస్థలు ఆయా మందుల్ని అందించేందుకు సిద్దంగా ఉన్నారు, ప్రజలెవరూ అపోహలకు, భయాందోళనలకు గురికావద్దని మంత్రి సూచించారు.