కులవృత్తుల అభివృద్ధికి ప్రణాళికలు- మంత్రి గంగుల

301
- Advertisement -

ఈ రోజు వెనుకబడిన తరగతుల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆయన కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఇప్పటి వరకు అమలు కావలసిన నిధులు మరియు మిగిలిన నిధుల ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులను నూతన సాంకేతికతను వినియోగించి వారి జీవితాలను మెరుగు పరచడానికి పథకాలను అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు.

గురువారం ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలలో బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన వెనుకబడిన తరగతులకు సంబంధించిన విద్యార్థులు 242 మంది నియామకం అయ్యారు. నియామకం పొందిన వారిలో సుమారు 25 శాతం విద్యార్థులు మన స్టడీ సర్కిల్లో శిక్షణ పొందినవారే ఇది మన శాఖకు గర్వకారణం. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయుచున్నాను.రానున్న రోజులలో సివిల్ సర్వీసెస్ పరీక్షలో కూడా ఎన్నిక కాబడతార అనే విశ్వాసంతో ఉన్నాను.

GANGULA

ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా మూడు వందల మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం విదేశాలలో చదువుకునే అవకాశం కల్పిస్తుంది మన కేసీఆర్ ప్రభుత్వం. ఇట్టి పథకం అమలులో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కళ్యాణ లక్ష్మి పథకానికి కావలసిన నిధుల విషయమై ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువెళ్లి తగిన నిధులను మంజూరు పొందుతామని తెలిపినారు.

నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా వెనుకబడిన తరగతుల యువకులకు వారి వారి కుల వృత్తులలో శిక్షణ అందించి వారికి ఆర్థిక చేయూత అందించి వారి జీవితాలలో వెలుగులు నింపాలని ఆలోచనతో మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారు. ఈ సమావేశంలో ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమీషనర్ అనితా రాజేంద్ర, సైదా జాయింట్‌ సెక్రెటరీ,అల్కో ఫెడరేషన్‌ ఎండీ చంద్రశేఖర్‌, రజక ఫెడరేషన్‌ ఎండీ హాజరైయ్యారు.

- Advertisement -