కేసీఆర్‌ హుజూర్‌నగర్‌ సభ షెడ్యూల్..

502
kcr huzurnagar meeting
- Advertisement -

హుజూర్‌నగర్‌లో అక్టోబర్‌ 26న సీఎం కేసీఆర్‌ ప్రజా కృతజ్ఞత,విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ సభ శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానుంది. అయితే అంతకు ముందు సీఎం కేసీఆర్‌ సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా అయను కలిసి అక్కడే భోజనం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హుజూర్‌నగర్ సభకు హాజరుఅవుతారు.

ఈ సభ సంబంధించిన ఏర్పాట్ల పూర్తయ్యాయి. ఈ ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ బడుగు లింగయ్య యాదవ్.. ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా ఎస్పీ భాస్కరన్ పరిశీలించారు. రేపు జరగబోతున్న ప్రజా కృతజ్ఞత సభను హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలు,టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు.

- Advertisement -