బీసీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి- మంత్రి గంగుల

107
minister gangula
- Advertisement -

బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చిత్తశుద్దితో చేపడుతోందన్నారు బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, అభివృద్దిలో వారి భాగస్వామ్యంను పెంపొందించి వారికి దక్కాల్సిన అవకాశాల కల్పన కోసం తాజాగా బిసి రిజర్వేషన్లు పదేళ్లపాటు పొడిగించిన సంగతిని గుర్తు చేశారు. అలాగే గతంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా రజక, నాయీ బ్రాహ్మణ కులవృత్తులు నిర్వహించుకొని లాండ్రీ షాపులు, దోబీఘాట్లు, సెలూన్ల ద్వారా జీవనం కొనసాగించే వారికి 250 యూనిట్ల కరెంట్ బిల్లు రాయితీలకు సంబందించి రూపొందించిన ఆన్ లైన్‌లో బెనిఫిషయరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అప్లికేషన్లను జూన్ 1 నుండి స్వీకరిస్తున్నట్టుగా వెల్లడించారు మంత్రి గంగుల. బిసిల అభ్యున్నతి కోసం నిరంతరం తపించే ముఖ్యమంత్రి కేసీఆర్‌కి క్రుతజ్ణతలు తెలుపుతూ ఇంత మంచి మనసున్న సీఎం మనకుండడం అదృష్టం అన్నారు గంగుల.

రజక, నాయీ బ్రాహ్మణ కులాలకు చెందిన కులవృత్తులు నిర్వహించుకొనే వారి సంక్షేమం కోసం ప్రతిపాదించిన కరెంట్ బిల్లు రాయితీలకు సంబందించిన మార్గదర్శకాలను, విదివిదానాలను ప్రభుత్వ మేమో నెం 957/D/2021 ద్వారా ఎప్రిల్ మెదట్లోనే ప్రకటించింది బిసి సంక్షేమ శాఖ. తాజాగా లాండ్రీ, దోబీఘూట్లు మరియు హెయిర్ కటింగ్ సెలూన్లకు 250 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించడం కోసం జూన్ 1తారీఖు నుండి 30వ తారీఖు వరకూ ఆన్ లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఓ ప్రకటన ద్వారా మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్టవ్యాప్తంగా ఉన్న 2 లక్షల రజక కుటుంబాలకు చెందిన లాండ్రీ షాపులకు,దోబీఘూట్లకు, నాయీభ్రాహ్మణ సోదరులకు చెందిన 70 వేల సెలూన్ల లబ్దీ చేకూరుతుందని. ఇందుకోసం అవసరమైన 250 యూనిట్ల కరెంటు రాయితీని ప్రతీ నెల ప్రభుత్వం వారికి జమ చేస్తుందన్నారు మంత్రి గంగుల. ఈ సదుపాయాలు పూర్తిగా ఆన్ లైన్‌లో పారదర్శకంగా ఉంటాయని, ఎవరూ దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు మంత్రి గంగుల.

ఆన్ లైన్‌లో www.tsobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్ లైన్‌లో రజక, నాయీభ్రాహ్మణ లబ్దీదారులు సొంతంగా 250 యూనిట్ల విద్యుత్ రాయితీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తిగత వివరాలు, షాపు వివరాలు, అప్లోడులు వంటి మూడు ప్రధాన విభాగాలుగా ఉండే ఈ ఆన్ లైన్‌ అప్లికేషన్‌లో పేరు, జెండర్, మెబైల్, ఆదార్ నెంబర్లు, కుల ద్రువీకరణ పత్రం, ఉపకులము, యూనిట్ పేరు, యూనిట్ చిరునామాతో పాటు తన పేరున/అద్దే నివాసానికి చెందిన కమర్షియల్ ఎలక్ట్రికల్ కన్జూమర్ నెంబర్ (కరెంట్ మీటర్ నెంబర్) వంటి వివరాల్ని ఎంటర్ చేసి వీటికి సంబందించి ఫోటో, తాజా ఎలక్ట్రిసిటి బిల్లు, షాపు/యూనిట్ ఫోటో, షాపుకు సంబందించి అద్దే నివాసంలో ఉంటే లీజు/అద్దె ఒప్పందం పోటోలతో పాటు ఆయా స్థానిక విబాగాలైన గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీ, కార్పోరేషన్లకు చెందిన కార్మిక లేదా వాణిజ్య లైసెన్స్ లను అప్లోడ్ చేసి స్వీయ ద్రువీకరణతో ఆన్ లైన్‌లో అప్లికేషన్ అందజేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు www.tsobmms.cgg.gov.in చూడవచ్చు.

- Advertisement -