మానవతకు మారుపేరు కేసీఆర్…

195
- Advertisement -

కరోనా సంక్షోభం అన్నిరంగాల్ని కుదిపేసింది. రాష్ట్రంలో విద్యాలయాలు మూసే ఉన్నాయి ఈ విపత్కర పరిస్థితుల నుండి ప్రైవేట్ స్కూళ్ల సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ సర్కార్ పెద్ద మనసుతో దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యాచరణ రూపొందించింది. మానవతకు మారుపేరుగా నిలిచే సీఎం కేసీఆర్ గారు పెద్ద మనసుతో ప్రైవేట్ స్కూల్ టీచర్లతో పాటు పాఠశాలలో పనిచేసే అన్ని రకాల సిబ్బందికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ఎప్రిల్ నుండి విద్యాలయాలు ప్రారంభమయ్యే వరకు ప్రతీ నెల 2వేల రూపాయలతో పాటు ప్రతీ ఒక్క ఉద్యోగికి 25కిలోల బియ్యాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి నెల దాదాపు 42కోట్ల 57లక్షలు అవసరమవుతాయనే అంచనాతో పౌరసరఫరాల శాఖ పూర్తి కార్యచరణతో సిద్దమయింది. ఈరోజు ఉదయం బీఆర్కే భవన్లో మంత్రి గంగుల కమలాకర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో దాదాపు 1లక్షా 45వేల మంది సిబ్బంది వివిద స్థాయిల్లో ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్నారని వారికోసం పౌరసరఫరాల శాఖ ప్రతీనెల 2వేల రూపాయల కోసం దాదాపు 29కోట్ల రూపాయలు, 25కిలోల బియ్యం కోసం దాదాపు 13 కోట్ల 57 లక్షల విలువ గల 3625 మెట్రిక్ టన్నుల దాన్యాన్ని సిద్దం చేసినట్టుగా మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ నెల నుండే గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాలయాల సిబ్బందికి సీఎం కేసీఆర్ గారు మానవీయ దృక్పథంతో సంకల్పించిన సహాయాన్ని అందిస్తామన్నారు మంత్రి గంగుల. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని లబ్దీదారులని రేషన్ షాపుల వారీగా గుర్తించి అందుకు అవసరమైన ఏర్పాట్లను సంపూర్ణంగా సిద్దం చేయాల్సిందిగా కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు. కరోనా సంక్షోబంతో రాష్ట్రం రాబడులు గణనీయంగా పడిపోయినా ఏ ఒక్కరూ ఆర్థాకలితో ఉండకూడదన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని. గతంలో సైతం ప్రతీ రేషన్ కార్డుదారులకు నెలకు 1500 లతో పాటు డబుల్ రేషన్ని ఉచితంగా అందించిన విషయాన్ని గుర్తుచేశారు మంత్రి. రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకానికి కోతలు విదంచలేదని, ఇలా దేశంలో సంక్షేమాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం కేవలం తెలంగాణ మాత్రమేనని, ఇది సీఎం కేసీఆర్ దార్శనికత, మానవతా హ్రుదయానికి నిదర్శనమన్నారు మంత్రి గంగుల.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దాదాపు లక్షా 45వేలుగా ఉన్న ప్రతీ ఒక్క ప్రైవేట్ విద్యా సంస్థల టీచర్లు, సిబ్బందిని ఆదుకుంటామని, పౌరసరఫరాల శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రతీ లబ్దీదారునికి సహాయం అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. కేసీఆర్ గారు సహ్రుదయంతో ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది, ఉపాద్యాయుల ఇబ్బందులు తొలిగించేలా 2వేల ఆర్థిక సహాయంతో పాటు, 25 కిలోల బియ్యాన్ని అందించినందుకు దన్యవాదాలు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న అన్ని జిల్లాల కలెక్టర్లు పథకం అమలు కోసం రూపొందించిన కార్యాచరణనీ మంత్రులు ఇతర ఉన్నత అధికారులకు వివరించారు. ప్రవేట్ విద్యాలయాల సిబ్బంది గుర్తింపుపై కలెక్టర్లకు మంత్రులు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ పౌరసరఫరాల, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -