రైతు బాధలు తెలిసిన రైతు భాందవుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. గురువారం ఆయన సొంత నిధులతో కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామంలో నిర్మించిన రైతువేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎకరా విస్థీర్ణం పెరగకున్నా పంట దిగుబడులు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌ది. నాడు బీళ్లతో బేరాలు పెట్టిన భూముల్లో నేడు కాళేశ్వర గంగతో పంట పరవళ్లు తోక్కుతుంది. రైతుని రారాజును చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరంతర కృషి చేస్తుందన్నారు.
రైతు బాధలు తెలిసిన వ్యక్తి మన సీఎం కేసీఆర్, రైతుకు ఏం చేస్తే మేలు జరుగుతుంది అని ఆలోచించి పరిపాలన చేసే నిజమైన రైతు బాందవుడు కేసీఆర్, బంగారు తెలంగాణ స్వాప్నికుడు ఉధ్యమకారుడే మనకు సీఎంగా ఉండడం మన అదృష్టం అన్నారు మంత్రి గంగుల. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.