సీఎం కేసీఆర్ నిర్ణయంతో దళితుల్లో ఆనందం- మంత్రి గంగుల

115
- Advertisement -

దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈర్షపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి దళిత బంధు అమలు చేస్తుందని అన్నారు రాష్ట్ర పౌర సరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో దళిత బంధు లబ్ధిదారులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లు దళిత బంధులో ఎంపికైన లబ్ధిదారులకు నాలుగు యూనిట్లు వాహనాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈర్షపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి దళిత బంధు అమలు చేస్తుందని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కన్న కళలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నారని కొనియాడారు. నిన్నటి వరకు డ్రైవర్‌గా ఉన్న అతను నేడు వాహన యజమానిగా, గతంలో గుమస్తా నేడు ట్రాలీ యజమానిగా మారడం దళిత బంధు గొప్పతనం అన్నారు.

స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని ఎండ్లు గడుస్తున్న దళితుల సంక్షేమానికి ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల కోసం దళిత బంధు ప్రకటించడం అభినందనీయం అని అన్నారు. అంచెల వారీగా దళితులందరికి దళిత బంధు పథకం అమలు అవుతుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా మంత్రులు దళిత బంధు పథకం కింద దాసారపు స్వరూప రాజయ్య దంపతులకు ట్రాక్టర్, ఎలుక పల్లి కొమరమ్మ – కనకయ్య దంపతులకు ట్రాక్టర్, జి సుగుణ – మొగలి దంపతులకు ట్రాలీ, రాచపల్లి శంకర్ కు మారుతి కారును మంత్రులు అందజేశారు.

- Advertisement -