ఎఫ్‌3 సెట్స్‌లో బన్నీ..!

72
pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ ఫారెస్ట్ డ్రామా ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. సినిమాలో ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఎఫ్‌ 2కు సీక్వెల్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్‌3.

ప్రస్తుతం హైద్రాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ లోకి పుష్పరాజ్ అల్లు అర్జున్ సడెన్ గా విచ్చేసి.. చిత్ర బృందానికి సర్ ప్రైజ్ ఇచ్చారు.ఓ హిలేరియస్ కామెడీ సీన్ ను షూట్ చేస్తున్నారట అనిల్ రావిపూడి. ఆ టైమ్ లోనే బన్నీ అక్కడికి అడుగుపెట్టడంతో సెట్లో మరింత సందడి నెలకొంది. వెంకీ, వరుణ్ లతో పాటు వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు అనిల్ రావిపూడి లతో కాసేపు మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.