నగరంలో సమర్ధవంతంగా రోడ్లను నిర్వహించేందుకు ఏన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పురపాలక శాఖామంత్రి కెటి రామారావు తెలిపారు. నగరంలోని రోడ్ల నిర్వహణ, మరమత్తుల కోసం జియచ్ యంసికి ప్రతి నెల ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నదని, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని మంత్రి అధికారులను అదేశించారు. ఈరోజు జలమండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో జియచ్ యంసి, జలమండలి, హెచ్చార్డీసీ, ఇంజరీంగ్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇప్పటికే ఒక్కో వార్డుకు ఒక్కో ఏఈ స్ధాయి అధికారిని నియమించినట్లు, రోడ్ల నిర్వహణకు ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. నిధులతో పాటు, సరిపడినంత సిబ్బందిని ఇస్తున్న తర్వతా కూడా ఈ వర్షకాలంలో రోడ్ల నిర్వహాణలో లోపాలుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అధికారులను హెచ్చరించారు. రానున్న 60 రోజుల్లో వర్షాలు వచ్చే నాటికి నీళ్లు నిలిచే ప్రాంతాల్లో శాశ్వత చర్యలు తీసుకుని ఏలాంటి సమస్య రాకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు సైతం తీసుకుని ఇలాంటి ప్రాంతాల గుర్తింపులో సమన్వయంతో ముందుకు పోవాలన్నారు.
గత ఏడాదిలో కురిసిన వర్షాల నేపథ్యంలో సూమారు 181 నీళ్ల నిలిచే ప్రాంతాలు, 346 రోడ్డ వల్నరబుల్ పాయింట్స్ గుర్తించామని మంత్రికి అధికారులు తెలిపారు. ఈ సమస్యాత్మక ప్రాంతాలకు జోనల్ కమీషనర్లు ప్రత్యేక భాద్యత తీసుకుని వాటిని పరిష్కరించాలని మంత్రి తెలిపారు. వర్షకాల ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఇప్పటి నుంచే రోడ్ల నిర్వహాణపైన చర్యలు తీసుకోవాలన్నారు. మెట్రో రైల్ కారిడార్లు, హెచ్చార్డీసి వంటి సంస్ధల పరిధిలో ఉన్న రోడ్లపైన జియచ్ యంసి కలిసి పనిచేసి వాటిని నిర్వహాణలో మరింత చొరవ చూపాలన్నారు. ఈ రోడ్ల నిర్వహాణ రాబోయే రెండు నెలల్లో యుద్ద ప్రాతిపాధికన జరగాలన్నారు. మెత్తం జియచ్ యంసి ఇంజనీరింగ్ సిబ్బందికి వచ్చే రెండు నెలల పాటు సెలవు రద్దు చేసి, నిర్వహాణ కార్యక్రమాలు పూర్తి చేయాలని మంత్రి జియచ్ యంసి అధికారులను అదేశించారు.
నగరంలో చేపడుతున్న వాటర్ వర్క్స్ పైపులైన్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లోనూ రోడ్ల మరమత్తులపైన జియచ్ యంసి జలమండలితో సమన్వయం చేసుకుని పనులు చేపట్టాలన్నారు. కాంట్రాక్టులో పేర్కోన్న విధంగా పైపులైన్లతోపాటు సమాంతరంగా రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేయాలని మంత్రి అదేశించారు. వాటర్ వర్క్స్ అద్వర్యంలో మ్యాన్ హోళ్ల నిర్వహాణపైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు.
ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్, జియచ్ యంసి కమీషనర్ జనార్ధన్ రెడ్డి, మెట్రో రైల్ సంస్ధ యండి ఏన్వీయస్ రెడ్డి, వాటర్ వర్క్స్ యండి దానకీశోర్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.