చైతన్యానికి మారుపేరు తెలంగాణ సమాజం..

169
etela rajendar
- Advertisement -

ప్రపంచంలోనే చైతన్యానికి మారుపేరు తెలంగాణ సమాజం అని రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఈరోజు హైదరాబాద్ సోమజిగూడ ప్రెస్ క్లబ్‌లో బిసి టైమ్స్ ,మహాత్మా పూలే ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బిసి కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సమ్మేళనంలో బిసి,ఎంబిసి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యం చేయడంలో,ముందుకు నడిపించడంలో జాతి విముక్తి కోసం మీరు చాలా కమిట్మెంట్తో పని చేస్తున్నారు. ప్రపంచంలోనే చైతన్యానికి మారుపేరు తెలంగాణ సమాజం. ఇక్కడి స్ఫూర్తి ఎక్కువ ఆకలినైన బరిస్తది కానీ ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టదు ఈ సమాజం.

పుట్టుకతో ఏ మనిషి కులంతో రాడు..మేధా శక్తి ఏ ఒక్క కులానికి పరిమితము కాదు..అవకాశం వస్తే ఎవరైనా గొప్పగా రాణించగలుగుతారు. కులంతో చిన్న వాళ్ళం అనే ఆత్మనూన్యతతో బతికే దౌర్భాగ్య పరిస్థితి అంతం కావాల్సిందే. సమాజంలో బిసిలు కూడా గొప్పగా బ్రతకాలని కోరుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని కులాలున్న దేశం భారతదేశం. భారతీయ సంప్రదాయాలు,సంస్కృతి గొప్పవి అని చెప్పుకున్న ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి మనిషిని మనిషి చిన్నగా చూసే దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ ఉన్నది దాన్నీ అంతం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు.. కమిట్మెంట్ లీడర్ షిప్ ఉంటే దేన్నైనా సాధించవచ్చు.. ఎవరు ఆత్మనూన్యత భావానికి లోను కాకూడదని మంత్రి ఈటెల పేర్కొన్నారు.

- Advertisement -