- Advertisement -
మెరుగైన వైద్య సేవలు తక్కువ ధరలో అందాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్‌ను మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న మెడిసిన్‌ను ప్రజలకు చేరవేయడమే తమ కర్తవ్యం అన్నారు. గతంలో ప్రభుత్వ అలోపతి ఆస్పత్రులకంటే ఎక్కువ ఆయుర్వేద ఆస్పత్రులు ఉండేవన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆయుర్వేద డాక్టర్లు పనిచేస్తున్నట్లు తెలిపారు. చికిత్స కోసం ఖర్చు పెట్టలేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారన్నారు. శాస్త్ర విజ్ఞానం పెరిగింది కానీ ప్రజలకు తక్కువ ధరకు వైద్యం అందడం లేదన్నారు.
- Advertisement -