- Advertisement -
ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలను కోరారు మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి టిమ్స్,కింగ్ కోఠి,గాంధీ ఆస్పత్రులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల…. కరోనా మొదటి వేవ్‌కు.. రెండో వేవ్‌కు చాలా తేడా ఉందన్నారు.
మొదటి వేవ్‌లో 20 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరారని, రెండో వేవ్‌లో 95 శాతం మంది ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.సీరియస్ కేసులు వస్తే ప్రైవేట్ ఆసుపత్రులు గాంధీ దవాఖానకు పంపుతున్నాయని….దవాఖానల్లో మొత్తం 47 వేల పడకల్లో సగానికిపైగా కొవిడ్ రోగుల చికిత్సకు వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఈ సమయంలో ఎవరూ ధర్నాలు చేయొద్దని మంత్రి సూచించారు.
- Advertisement -