బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోంది- మంత్రి ఈటెల

243
Minister Etela Rajender
- Advertisement -

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి చిల్లర రాజకీయాలు చేస్తోంది. బీజేపీ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై లేనిపోని..చిల్లర ఆరోపణలు చేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. నిన్న జరిగిన జన్‌ సంవాద్‌ సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నాయకులు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనిపై మంత్రి ఈటల మండిపడ్డారు. కరోనా టెస్టులు-మరణాలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై జేపీ నడ్డా పచ్చి అబద్ధాపు ఆరోపణలు చేశారు. ప్రాంతీయ పార్టీలపై బీజేపీ ఆరోపణలు చేసే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల పనితీరు చూసుకొని మాట్లాడాలని మంత్రి ఈటెల విమర్శించారు. కరోనా కట్టడికి డే వన్ నుంచి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని ఈటెల స్పష్టం చేశారు.

ఢిల్లీ-పార్లమెంట్‌కి కూతవేటు దూరంలో మీరు పట్టించుకోకపోతే, మర్కజ్ కేసులు ట్రేస్ చేసి బయటపెట్టింది తెలంగాణ. కరోనా కట్టడిలో సఫలం అయిన రాష్ట్రం తెలంగాణ. కరోనా విషయంలో రాజకీయాలు చేయకుండా కేంద్రానికి-ప్రధానికి మద్దతుగా ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణ-కేసీఆర్ అని ఈటెల తెలిపారు. ఒక జాతీయస్థాయి నాయకుడు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చిల్లరతనం. ఢిల్లీ స్థాయి నాయకుడు-గల్లీ మాటలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. విదేశీ వైరస్ కరోనా కాబట్టి అంతర్జాతీయ రవాణా బంద్ చేయాలని కోరిన మొదటి వ్యక్తి కేసీఆర్.కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పనితీరును కేంద్ర బృందాలు మెచ్చుకున్నాయన్నారు. కేంద్ర బృందాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటే వారిపై కూడా ఫిర్యాదు చేసిన పార్టీ రాష్ట్ర బీజేపీ. బీజేపీకి రాజకీయాలు తప్పపేదల ప్రాణాలు కాపాడే ఆలోచన లేదు అని మంత్రి దుయ్యబట్టారు.

తెలంగాణలో 200 మంది అయితే దేశంలో 13వేలు మరణించారు. ICMR ఎన్ని సార్లు గైడ్ లెన్స్ మార్చినా తూచా తప్పకుండా పాటించాము. ICMR నిబంధనల ప్రకారమే లక్షణాలు లేని వాళ్లకు హోమ్ ఐసోలేషన్ ఇస్తున్నాము. కేంద్రం 2లక్షల N95 మాస్కులు- బిచ్చం లెక్క పీపీఈ కిట్లు మాత్రమే ఇచ్చారు. టెస్టులు చేసే యంత్రాలు తెలంగాణకు కొనుక్కుంటే వాటిని కలకత్తాకి తరలించారు. 14లక్షల ఎన్ 95 మాస్కులు- 10లక్షల పీపీఈ కిట్లు తెచ్చి రెడిగా ఉన్నాము. కేరళ-మద్రాస్ తరువాత తెలంగాణ వైద్యరంగంలో దూసుకుపోతుందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి రైస్ బౌల్‌గా అవతరిస్తోంది. ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయొద్దు. మతాల చుట్టూ తిరిగే పార్టీ బీజేపీ.కేంద్రం ఇచ్చే నిధుల ఊరికే ఇవ్వడం లేదు..రాష్ట్రాలు టాక్స్ లు కడుతున్నాయని మంత్రి ఈటెల పేర్కొన్నారు.

- Advertisement -