కరోనాపై దుష్ప్రచారం చేస్తున్నారు- మంత్రి ఈటల

364
Minister Etela Rajender
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ’కరోనా‘ వైరస్ సోకిందన్న వదంతులను నమ్మొద్దని, ఈ వైరస్ బారిన ఎవరూ పడలేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ‘కరోనా’ వైరస్ వ్యాపించిందంటూ సోషల్ మీడియాతో దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు.

‘కరోనా’పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి కాదని ఆయన స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయని, వారి బ్లడ్ శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం పుణేకు పంపామని అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసు ఒక్కటి మాత్రమే నమోదైందని మంత్రి వెల్లడించారు.

- Advertisement -