ఇరు రాష్ట్రాల ప్రజల సంక్షేమమే ధ్యేయం.. మంత్రి ఈటెల

304
Minister Etela Rajender
- Advertisement -

తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు పటిష్టం చేసే దిశగా తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ఈ రోజు ప్రగతిభవన్‌లో జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం తదితర అంశాలపై ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ చర్చించారు. ఈ సమావేశంలో సాగునీటి సమస్యలపైనే సుదీర్ఘ చర్చ జరిగిందని ఇరు రాష్ట్రాల మంత్రులు ఈటల రాజేందర్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. సీఎంల సమావేశం ముగిసిన అనంతరం ఇద్దరు మంత్రులు మీడియాతో మాట్లాడారు.

CM KCR

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. నీటిపారుదలపై, పునర్విభజన చట్టాలపై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లోని మెట్ట ప్రాంతాలకు నీరు అందించడమే తమ లక్ష్యమని అన్నారు. షెడ్యూల్ 9,10 లోని అంశాలను పరిష్కరించే దిశగా చర్చించామని చెప్పారు. నదీ జలాలను రెండు రాష్ట్రాలు వినియోగించుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. ఇరు రాష్ట్రాల ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ధ్యేయమని, సమస్యలు పరిష్కరించుకుంటేనే రాష్ట్రాలు బాగుపడతాయని, తెలంగాణ, ఏపీలు గొప్ప వ్యవసాయ రాష్ట్రాలుగా ఎదగాలని ఈటల ఆకాంక్షించారు.

CM KCR

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలు కలిసి నదీ జలాలు వినియోగించుకోవడంపై ప్రధాన చర్చ జరిగింది. ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు అని పేర్కొన్నారు. ఏయే ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉందనే విషయంపై ఇరువురు సీఎంలకు మంచి అవగాహన ఉంది. నీటి సమస్య పరిష్కారానికి సూచనలు, వ్యూహాలు ఇవ్వాలని అధికారులు, ఇంజినీర్లకు సీఎంలు ఇద్దరూ సూచించారు.

రెండు రాష్ట్రాలు జల వివాదాలు పరిష్కరించుకుని దేశానికే ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నాం. కోర్టుకు, ట్రిబ్యునళ్లకు వెళ్లినా.. కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. సామరస్యంగా చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకుందామనే భావన ఇరువురు సీఎంలలో ఉంది. అభివృద్ధి కోసం సోదరులుగా కలిసి ప్రయాణం చేద్దామని ఇరువురు సీఎంలు నిర్ణయించుకున్నారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -