ప్రతీ పల్లెకు మెరుగైన వైద్యం.. మంత్రి ఈటెల

755
Minister Etela Rajender
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పేదలకు వైద్యం అందాలని బంగారు తెలంగాణ కావాలని సీఎం కేసీఆర్ కలలు కన్నారు.మహిళలకు పౌష్టక ఆహారం ,కేసీఆర్ కిట్స్ లాంటి పథకాలు అందించారు. మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న ఆసుపత్రులు మెరుగు పర్చాము. అడవుల్లో ఉన్న ఆదివాసులకు,మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్యం అందించాలనేది ప్రభుత్వం ఉద్దేశ్యం.

Minister Etela Rajender ట్రైబల్ ప్రాంతాల్లో ఉన్న ఉన్న అధికారులతో, నేతలతో సమీక్ష నిర్వహించాం..మెడికల్ కాలేజీల్లో సీట్లు కూడా పెంచాం.ప్రొఫెసర్స్‌ల వయస్సు కూడా 65 ఏళ్లకు పెంచుతున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పెంచడం జరిగింది.నగరంలో ఉన్న హాస్పిటల్ లలో ఉన్న 3000 పడకల గదులను ఏర్పాటు చేస్తున్నాం.ఎయిమ్స్ ఆసుపత్రి పని నడుస్తోంది.

ఉద్యోగులకు, జర్నలిస్ట్ లకు హెల్త్ కార్డ్స్ విషయంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అన్ని ఆసుపత్రుల్లో హెల్త్ కార్డ్స్ తోపాటు ఆరోగ్య శ్రీ పని చేస్తాయి. త్వరలో దంత వైద్యశాలల్లో కూడా నియామకాలు చేపడుతామని మంత్రి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ కిట్‌ను ప్రైవేట్‌కు అప్పగించం జరగదన్నారు.ప్రతి పేద విద్యార్థి వైద్య విద్యను అభ్యసించే విదంగా అనేక జిల్లాల్లో వైద్య కళాశాల లు ఏర్పాటు చేశామని తెలిపారు మంత్రి ఈటెల రాజేందర్‌.

- Advertisement -