రవీంద్ర భారతిలో “జీవన్ దాన్” ఆధ్వర్యంలో జరిగిన 10వ డోనార్ ఫెలిసిటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈటల రాజేందర్ మంత్రి హాజరైయ్యారు. జీవన్ దాన్ గొప్ప విషయం.. సొంత వారు చనిపోతున్న సమయంలో అవయవదానం చేయాలి అనే నిర్ణయం తీసుకోవడం ఎంత కష్టమో మాటల్లో చెప్పలేనిదని మంత్రి అన్నారు. అవయవదానం చేసి మరికొంతమందికి ప్రాణదానం చేసిన మహనీయుల కుటుంబాల వివరాలను సేకరించినట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
అవయవదానంలో తెలంగాణలో దేశంలోకెల్లా ముందజలో ఉంది. ప్రజల్లో అవగాహన పెంచి ఎక్కువ మందికి ప్రాణదానం చేయడంలో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటామని ఈటెల చెప్పారు. అవయవ దానం చేసిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వపరంగా సాయం అందించేందుకు సీఎం కేసీఆర్తో చర్చిస్తానని అన్నారు. అవయవ మార్పిడి చేసుకున్న వారికి ఆరోగ్య శ్రీ ద్వారా బ్రతికున్నంత కాలం మందులు అందించేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి ఈటెల.
The 10th Donor Facilitation Ceremony was held under the auspices of “Jeevan Dan” at Ravindra Bharati. The event was attended by the Minister etela Rajender.