కేంద్ర‌మంత్రితో మంత్రి ఈట‌ల వీడియో కాన్ఫ‌రెన్స్‌

253
minister etela rajendar
- Advertisement -

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ విడియో కాన్ఫరెన్స్ కి హాజర‌య్యారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. కరోనా వైరస్ పేషంట్స్ కి చికిత్స అందించే సమయంలో ఉపయోగించే పెర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్స్, వెంటిలేటర్స్, ఐసీయు పరికరాలు హైదరాబాద్ లోనున్న DRDO, BDL,ECIl లాంటి సంస్థల్లో తయారు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.

మందులు, వైద్య పరికరాలు, నిత్యావసర వస్తువులు రాష్ట్రాల సరిహద్దులు దాటేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వెంటనే అనుమతి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. N-95 మాస్క్ లు, పెర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్స్,వెంటిలేటర్స్ అందించాలని కోరారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రెండు వారాలు కీలకమైనవి అని అన్నారు. విదేశాల నుండి వచ్చిన వారిని ఆబ్జర్వేషన్ లో ఉంచాలని, హోమ్ క్వారంటెన్ నుండి బయటికి రాకుండా చూడాలని కోరారు.

ఆశా వర్కర్లకి ఇన్సూరెన్స్ చేసినట్లు ప్రకటించారు. వైద్య సిబ్బందికి వైరస్ సోకకుండా చూసుకోవాలని సూచించారు.

- Advertisement -