రైతు వేదికనను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి..

19
Minister Errabelli

గురువారం రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు జనగామ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని దేవరుప్పుల మండలంలో తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత చారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా రూ.10 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

మండలంలోని గొల్లపల్లిలో శ్రీకాంత చారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి ఎర్రబెల్లి. గొల్లపల్లిలో రూ.4కోట్ల 52 లక్షలతో చేపట్టిన చెక్ డ్యాం శంకుస్థాపన మంత్రి చేశారు. గొల్లపల్లి లోనే…రూ. 1 కోటి 20 లక్షలతో పూర్తి చేసిన 24 డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా ప్రారంభించారు. దేవరుప్పుల మండల కేంద్రంలో రూ.2కోట్ల 47 లక్షలతో పూర్తి చేసిన 49 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, సంబంధిత లబ్ధిదారులకు అందజేశారు.

అలాగే దేవరుప్పుల మండల కేంద్రంలో 22 లక్షలతో పూర్తి చేసిన రైతు వేదికను, రూ.16 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని ప్రారంభించారు. రూ.5లక్షలతో నిర్మించిన యాదవ కమ్యూనిటీ హాల్ ని ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమాల్లో, జిల్లా కలెక్టర్ నిఖిల, ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు ప్రజలు పాల్గొన్నారు.