స్వరాష్ట్రంలో ఆలయాలకు పూర్వవైభవం దక్కిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని మంత్రి ఎర్రబెల్లి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే దేవాలయాలకు పూర్వవైభవం వచ్చిందని తెలిపారు.
తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. తెలంగాణలో చరిత్రలో నభూతో న భవిష్యత్తు అన్న చందంగా సీఎం కేసీఆర్ యాదాద్రి దేవాలయాన్ని పునర్ నిర్మించారని చెప్పారు. యాదాద్రి ఆలయం ఇల వైకుంఠపురంగా వెలిసిందని, భవిష్యత్తులో గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు.
Also Read:మా ఊర్లో కాంగ్రెస్కు ప్రవేశం లేదు..!
ముఖ్యమంత్రి తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని కోరుకున్నట్లు వెల్లడించారు.