దీక్షిత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి..

47
Minister Errabelli dayakar

ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో 9 ఏళ్ల దీక్షిత్ రెడ్డి కిడ్నాప్,హత్య ఘటన జరిగిన విషయం తెలిసింది. కాగా సోమవారం దీక్షిత్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా దీక్షిత్ రెడ్డి చిత్రపటానికి పూలతో అంజలి ఘటించారు మంత్రి ఎర్రబెల్లి దరయాకర్‌ రావు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..దీక్షిత్ రెడ్డి కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. ఇంటి పక్క వాడే ఇంత దుర్ఘటనకు పాల్పడటం బాధాకరమన్నారు. దీక్షిత్ రెడ్డిని చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. పోలీసులు కూడా ఈ కిడ్నాప్‌ను చేధించడానికి చాలా కష్టపడ్డారని మంత్రి తెలిపారు.

దీక్షిత్ రెడ్డి మళ్లీ తిరిగి వస్తాడని అందరం భావించాం. ప్రజలందరూ మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఈ సంఘటన గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటాం. దీక్షిత్ రెడ్డి కుటుంబానికి మేము అండగా వుంటామని మంత్రి వారికి ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో ఎంపీ మాలోత్ కవిత,ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.