- Advertisement -
వరంగల్ రూరల్ సంగెం మండలంలో దేవాదుల కాలువ సందర్శనలో భాగంగా గవిచర్ల శివారులో మంత్రి దయాకర్ రావు,పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి నాగలిపట్టి దుక్కిదున్నారు. ఎర్రబెల్లి దుక్కి దున్నుతుండగా.. ఎమ్మెల్యే విత్తనాలు నాటారు. అలాగే ఎమ్మెల్యే దున్నుతుండగా.. మంత్రి విత్తనాలు నాటారు.
అలా వారిద్దరూ కాసేపు రైతులతో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని పొలాల్లో పారిస్తున్నందుకు మంత్రి, ఎమ్మెల్యేకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. 14 ఏండ్ల కల సాకారమైందని రైతులు ఎంతో అనందం వ్యక్తం చేశారు.
- Advertisement -