వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలోని పిఎంఎస్ ఎస్ వై వైద్యశాలకు రూ.12 కోట్లను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.పిఎంఎస్ ఎస్ వై హాస్పిటల్ అభివృద్ధికి రూ.10 కోట్లు అడిగితే, రూ.12 కోట్లు విడుదల చేసిన సిఎం కెసిఆర్.కరోనా నియంత్రణ కోసం 250 పడకల వైద్యశాలగా పిఎంఎస్ ఎస్ వై హాస్పిటల్ ని వినియోగించనుంది. ఇందుకు సంబంధించి పరిపాలన అనుమతులను వెంటనే ఇవ్వాలని వైద్యశాఖను ఆదేశించారు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి రోనాల్డ్ రోస్.
రూ.10 కోట్లు అడిగితే, రూ.12 కోట్లు ఇచ్చిన సీఎం కెసిఆర్ గారికి, ఐటీ మంత్రి కెటిఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, వైద్యశాఖ మంత్రి ఈటలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.వరంగల్ ఉమ్మడి జిల్లాలో కరోనా నియంత్రణకు ఈ నిధులు ఎంతో తోడ్పాటునిస్తాయన్నారు. కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం, సీఎం కెసిఆర్ నిబద్ధతకు ఈ నిధుల విడుదలే నిదర్శనం అని ఈ నిధులతో సాధ్యమైనంత త్వరగా కెఎంసి ఆవరణలోని పిఎంఎస్ ఎస్ వై హాస్పిటల్ ని అందుబాటులోకి తెస్తాం అన్నారు. దీంతో 250 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాకు మొత్తం 500 పడకలు అందుబాటులో ఉంటాయన్నారు.
ఉమ్మడి జిల్లా కరోనా బాధితులను వరంగల్ జిల్లా కేంద్రంలోనే చికిత్సలు అందుతాయని..తనతోపాటు మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో ఇప్పటికే అనేకసార్లు సమీక్షలు నిర్వహించాం అన్నారు.కరోనా వైరస్ ని నియంత్రించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలతో కలిసి సమిష్టిగా ఎదుర్కొంటాం అన్నారు.
స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటిస్తూ, పౌష్టికాహారం తీసుకుంటూ, ధైర్యంగా కరోనా వైరస్ ని నియంత్రిద్దామని…ప్రజలు అధైర్య పడొద్దు, ఆందోళన చెందొద్దన్నారు.ప్రభుత్వం ప్రజలకు పూర్తి అండగా ఉందని….ఇప్పటికే ప్రభుత్వం కరోనా నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.
ప్రజలను కాపాడుకోవడానికి సిఎం కెసిఆర్ నేతృత్వంలో నిరంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రమిస్తున్నారని తెలిపిన ఎర్రబెల్లి…
అడిగిన వాటికంటే ఎక్కువ నిధులు ఇచ్చిన సిఎం కెసిఆర్‌కి , మంత్రులు కెటిఆర్, హరీశ్ రావు, ఈటలకి కృతజ్ఞతలు తెలిపారు.