వరంగల్‌లో ఫిలీ స్టూడియో పెట్టాలని ఇండస్ట్రీ పెద్దలను కోరారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అక్కినేని అఖిల్ , సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏజెంట్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం వరంగల్ లో భారీగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Also Read:IPL 2023:నేటి మ్యాచ్ లో గెలిచేదేవరు?
ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి..వరంగల్ లో ఏ సినిమా చేసినా హిట్ అవుతుంది. స్టార్ హీరోలు అంతా సినిమాలు చేశారు ఇక్కడ. వరంగల్ లో సినిమా ప్రమోషన్స్ చేసిన అన్ని సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఏ సినిమా చేసినా వరంగల్ లో ప్రమోషన్స్ చేయండి. నేను చూసుకుంటా అన్నారు.
ఇక్కడ ఫిలిం స్టూడియో పెట్టండి..సీఎం కేసీఆర్‌తో మాట్లాడి స్థలం ఇప్పిస్తానని చెప్పారు. మీకు ఎంత జాగా కావాలన్నా అంత ఇప్పిస్తాను. స్టూడియో పెట్టె బాధ్యత మీదే. తెలంగాణ వచ్చాక హైదరాబాద్ తర్వాత అంత గుర్తింపు ఒక్క వరంగల్ కే వచ్చింది. ప్లీజ్ ఇక్కడ ఒక్క స్టూడియో పెట్టండి. మీకు ఏ విషయంలో సపోర్ట్ కావాలన్నా ఉంటాను అన్నారు.
Also Read:లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. !