కేంద్రం నుండి ప్రశంసలే…పైసలు మాత్రం వస్తలేవు!

217
errabelli
- Advertisement -

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తనదైన శైలీలో మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గ్రామపంచాయతీల అభివృద్ధిపై మాట్లాడిన ఎర్రబెల్లి.. కేంద్ర ప్ర‌భుత్వం అవార్డుల మీద అవార్డులు ఇస్తోంది.. మోయ‌లేక చ‌స్తున్నా.. శాలువాల మీద శాలువాలు క‌ప్పుతున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌డం లేదని ఎద్దేవా చేశారు.

బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వాళ్లు ఇక్క‌డ ఊప‌డం కాదు.. డ‌బ్బు ఇవ్వాల‌ని కేంద్రాన్ని బీజేపీ నేత‌లు అడిగితే బాగుండన్నారు. చెత్త ఉన్న గుజ‌రాత్‌కు మాత్రం నిధులు ఇస్తారు…. తెలంగాణ‌లోని గ్రామ‌పంచాయ‌తీల‌కు కేంద్రం నుంచి నిధులు రావ‌డం లేద‌న్నారు. అద‌నంగా తాము పైస‌లు ఇవ్వాల‌ని అడ‌గ‌లేదు.. మ‌న‌కొచ్చే పైస‌లు ఇవ్వ‌మ‌ని అంటే అవి కూడా ఇవ్వ‌ట్లేదని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో గ్రామ‌పంచాయ‌తీలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయ‌న్నారు. గాంధీ క‌ల‌లుక‌న్న గ్రామ‌స్వ‌రాజ్యం టీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో నెర‌వేరుతుంద‌న్నారు. ఒక్కో గ్రామ‌పంచాయ‌తీకి వైకుంఠ‌ధామం, న‌ర్స‌రీ, డంపింగ్ యార్డు, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నంతో పాటు ట్రాక్ట‌ర్ మంజూరు చేశామ‌న్నారు. ప‌ల్లె ప్ర‌గ‌తిలో పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా పాలు పంచుకోవ‌డం త‌న అదృష్టంగా భావిస్తున్నాన‌ని పేర్కొన్నారు.

- Advertisement -