బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి… బీజేపీ కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతోందన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేసిన ఎర్రబెల్ఇ.. మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కేసీఆర్ పాలనను గొప్పగా పొగిడారు…. రైతులపై కేంద్ర బీజేపీ ఎందుకు ఇంత కక్ష సాధిస్తోందన్నారు.
నకిలీ విత్తనాలను అరికట్టడానికి కేసీఆర్ చట్టం తెచ్చారు…. రేవంత్ రెడ్డి ప్రగల్బాలు చెప్తూ- ఉన్నది లేనట్లు- లేనిది ఉన్నట్లు మాట్లాడుతాడన్నారు. రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రేస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపై ధర్నాలు చేసి/ నోటికి వచ్చిన బూతులు తిట్టింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలను టీఆరెస్ కేసీఆర్ కడుగుతున్నారు… రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యాయి అని మేము అనడం లేదన్నారు. .
కేసీఆర్ రైతు బంధావుడు… కేసీఆర్ రైతులకు చేసే అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోందన్నారు. కేంద్రం నుంచి సహాయం ఉంటే రైతులు మరింత లాభపడుతారన్నారు. కరోనా వల్ల రైతులకు కొంత ఇబ్బంది అవుతుంది…. రైతులకు ఎమ్ చేయని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయన్నారు. కేసీఆర్- కేటీఆర్ పై చేయి ఎస్తే ప్రజలు ఉరికిచ్చి కొడతారు…. కేసీఆర్ ను కొట్టే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు.