పల్లాను గెలిపించండి: మంత్రి ఎర్రబెల్లి

101
dayakarrao

వరంగల్ అర్బ‌న్ జిల్లా కేంద్రం హ‌న్మ‌కొండ‌ లోని న్యూ సైన్స్ కళాశాల లెక్చరర్లు, పట్టభద్రులు తమ ఓటును వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆరెఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కే వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభ్యర్థించారు.

హ‌న్మ‌కొండ హంట‌ర్ రోడ్డులో గ‌ల న్యూ సైన్స్ కళాశాల లో టిఎస్ పాస్ ఆధ్వ‌ర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలను స‌రిపోల్చి చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. చెప్పిన‌వీ, చెప్ప‌నివీ అనేక ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయ‌ని, వాటిని కేంద్రం స‌హా, ఇత‌ర రాష్ట్రాలు అనుస‌రిస్తున్నాయ‌ని అన్నారు.

కెసిఆర్ ఆశీర్వాదంతో ఇక్క‌డ వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా పోటీలో నిలిచిన ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి అభ్య‌ర్థిత్వాన్ని బ‌ల‌ప‌ర‌చాల‌ని ఆయ‌న కోరారు. ఈ స‌మావేశంలో ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ప‌ల్లా రాజేశ్వ‌రెడ్డి, క‌ళాశాల యాజ‌మాన్యం, సంగ‌ని మ‌ల్లేశ్వ‌ర్, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.