గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షం పడింది.…ప్రభుత్వ తీసుకున్న చర్యలతో ప్రాణ నష్టం జరుగలేదు.ప్రతిపక్షాలు అభినందిచాల్సి పోయి విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.ప్రభుత్వ చర్యలను ప్రజలు అభినందించారు….అక్రమ కట్టడాలు ఏ పార్టీ వారివైన వదిలే ప్రసక్తి లేదన్నారు.దసరా నాటికీ కూల్చివేయాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు….
ప్రజల కోరిక మేరకే అక్రమ కట్టడాల కూల్చివేతలు చేస్తున్నాం.. దీన్ని కూడా రాజకీయం చేయొద్దు అన్నారు.వరంగల్ అభివృద్ధి పై సీఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు .25కోట్లు తాత్కాలిక సహాయమే.. పూర్తిస్థాయిలో అంచనా వేసుక మరిన్ని నిధులు మంజూరి చేస్తాం అన్నారు.
బయటి వ్యక్తులు వచ్చి వరంగల్ పై ఏదో మాట్లాడితే.. ఇక్కడి ప్రజలు సహకరించొద్దు.సీఎం కెసిఆర్ మంత్రి కేటీఆర్ లు భూపాలపల్లి లో 10మంది రైతులను కాపాడితే ప్రతిపక్షాలు అభినదించాయ ..?మిషన్ కాకతీయ వల్లే ఇంత వర్షం వచ్చిన ఒక్క చెరువు తెగలేదన్నారు.
అభిందించకపోయిన పర్వాలేదు.. విమర్శలు సరికాదు.ఎంజీఎం లోని కోవిద్ వార్డుకు కేటీఆర్ తో పటు నేను ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే రాజయ్య కలిసి వెళ్ళాం ..కోవిద్ రోగులకు భరోసా కల్పించాం అన్నారు.మెరుగైన వైద్యం అందుతుందని రోగులు మాకు చెప్పి అభినందించారు.ఎంజీఎం లో కోవిద్ రోగులకు మెరుగైన వైద్యం అందుతుంది .. ప్రతిపక్షాలు నాతో వస్తే చూపిస్తానన్నారు.