రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సోదర, సోదరీమణుల మధ్య అనురాగాన్ని, అనుబంధాలను పెంచే అరుదైన పండుగ రాఖీ అన్నారు. అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లు ఒకరికొకరు అండగా, అప్యాయతలు నిండుగా పంచుకునే, అనుబంధాలు మెండుగా పెంచుకునే పండుగ అని తెలిపారు.
మన సంస్కృతి, సంప్రదాయాలకనుగుణంగా సమాజంలో మహిళల పట్ల మరింత గౌరవం పెరిగేలా మనమంతా ప్రవర్తించాలన్నారు.మహిళల్ని తోబుట్టువులా గౌరవించే సంస్కృతి మరింతగా అభివృద్ధి కావాలి…మనలో, సమాజంలో సగంగా ఉన్న మహిళల సంక్షేమానికి సిఎం కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
మహిళల స్వావలంబన, అభివృద్ధి, భద్రతలో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది..రాష్ట్రంలో అందరికీ అన్నలా…ఆడపిల్లలకు తండ్రి లా సీఎం కేసిఆర్ అన్ని విధాలుగా అండగా ఉన్నారని తెలిపారు. అభివృద్ధితోపాటు స్త్రీ, శిశు సంక్షేమానికి, రక్షణకు అనేక పథకాలు అమలు చేస్తున్నారు.కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యలక్ష్మీ, అమ్మ ఒడి-కెసిఆర్ కిట్లు, తక్కువ వడ్డీకే రుణాలు ఇలా అనేక పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని చెప్పారు. కరోనా కారణంగా తగు జాగ్రత్తలు పాటిస్తూ… ఈ పండుగ జరుపుకోవాలి..కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలంతా స్వీయ నియంత్రణ, సమాజిక దూరం పాటిస్తూ భాగస్వాములు కావాలన్నారు.