సీపీని స‌త్క‌రించిన మంత్రి ఎర్ర‌బెల్లి

245
warangal cp
- Advertisement -

ఈ నెలాఖ‌రున పద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న వ‌రంగ‌ల్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ డాక్ట‌ర్ ర‌వింద‌ర్ ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స‌త్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, త‌న ప‌ద‌వీ కాలంలో సిపి ర‌వింద‌ర్ మంచి పేరు తెచ్చుకున్నార‌న్నారు. ఉద్యోగ స‌మ‌యంలో చేసే మంచి ప‌నులు ఆ ఉద్యోగుల‌కు కీర్తిని తెచ్చి పెడతాయ‌న్నారు. మంచి ఉద్యోగుల‌ను ప్ర‌జ‌లు చిర‌కాలం గుర్తు పెట్టుకుంటార‌ని చెప్పారు.

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ర‌వింద‌ర్ ఆయు ఆరోగ్యాల‌తో ఉండాల‌ని కోరుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, గుండా ప్ర‌కాశ్ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -