జాతిపిత జీవితం దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శం..

121
minister errabelli
- Advertisement -

భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా పుష్పాంజలి ఘటించారు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయం ఆర్ అండ్ బి అతిథి గృహంలో గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ జీవితం దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శం, స్ఫూర్తిదాయకం. సత్యాగ్రహం, అహింస మార్గాల ద్వారా దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్ముడు అని మంత్రి కొనియాడారు. గాంధీజీ బాటలోనే స్వ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్న మహాత్ముడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.

గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారు.సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి సాగుతున్నది. ఇప్పుడు గ్రామాల్లో నర్సరీలు తడి, పొడి చెత్తను వేరు చేసే డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, రైతులకు కళ్ళాలు, రైతులను సంఘటిత పరిచే, చైతన్యం చేసే విధంగా రైతు వేదికలు వైకుంఠ ధామాలు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు గ్రామాల మధ్య లింకు రోడ్లు ఇట్లా అనేక విధాల అభివృద్ధి కొనసాగుతున్నది. సీఎం ఆలోచనలతో, పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతున్నదని మంత్రి వివరించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలకు ట్రాక్టర్లను సమకూర్చడం జరిగింది. ప్రతి నెలా క్రమం తప్పకుండా, కేంద్ర నిధులకు సమానంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.308 కోట్లను విడుదల చేస్తున్నది. అతి చిన్న గ్రామ పంచాయతీలకు కూడా కనీసం ప్రతి నెలా రూ.5లక్షలకు తగ్గకుండా అభివృద్ధి నిధులు అందుతున్నాయి. ఎప్పటికైనా, ప్రపంచానికి గాంధీజీ చూపిన మార్గమే శరణ్యం
అహింస, సత్యాగ్రహం మాత్రమే లోక కళ్యాణానికి మార్గదర్శకాలు అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

- Advertisement -