కేంద్ర బిల్లులు రైతులకు షరా ఘాతంగా మారాయి: ఎర్రబెల్లి

126
Mareddy Errabelli
- Advertisement -

మన రాష్ట్రంలో అమలు అవుతున్న అన్ని పథకాలు దేశంలో ఎక్కడా లేవు అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మంగళవారం ఆయన వరంగల్ రూరల్ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని శాయంపేట మండలం పెద్ద కోడెపాకలో నూతన గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదికను మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. గత పాలనకు, ప్రస్తుత పాలనకు పోల్చి చూడండి.. ప్రజలు విశ్లేషించుకోవాలి. గత ప్రభుత్వ కాలంలో ట్రాన్స్ఫార్మర్, మోటార్లు కాలిపోయేవి. కానీ ఇప్పుడు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన మహాత్ముడు కెసిఆర్ అని మంత్రి కొనియాడారు.

12వేల కోట్లు రైతుల తరపున విద్యుత్ సంస్థకు ప్రభుత్వమే కడుతున్నది. పక్క రాష్ట్రంలో 7 గంటలు కూడా విద్యుత్ రావడం లేదు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడా ఇలా కరెంటు ఇవ్వడం లేదని మంత్రి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చే 3 టీఎంసిల నీటిని రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతున్నది. ప్రభుత్వమే రైతుల పంటలను కొనుగోలు చేసిన రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా?! ఒక్క సీఎం కెసిఆర్ తప్ప, దేశంలో ఎక్కడ అయినా రైతు వేదికలు, కల్లాలు కట్టారా? పల్లె ప్రగతి ఉందా? పట్టణ ప్రగతి ఉందా? అని మంత్రి ప్రశ్నించారు.

మన రాష్ట్రంలో అమలు అవుతున్న అన్ని పథకాలు దేశంలో ఎక్కడా లేవు. కేంద్ర బిల్లులు రైతులకు షరా ఘాతంగా మారాయి. కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టొద్దు. మద్దతు ధర ముందే చెప్పమని రైతులు అడుగుతున్నారు. ప్రజలు కేంద్ర బిల్లులను వ్యతిరేకించాలి. స్థానిక సంస్థలకు నిధులు, విధులు ప్రత్యేకంగా సీఎం కెసిఆర్ అందిస్తున్నారు. వాటితో స్థానిక సంస్థలు మరింత బలోపేతం అవుతాయి. అలాగే, గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయి. రాష్ట్రం బంగారు తెలంగాణ అవడం ఖాయమని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సదానందం, జిల్లా కలెక్టర్ హరిత, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -