వరంగల్ అర్బన్ ఐనవోలే మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్బంగా మాట్లాడిన ఎర్రబెల్లి..టీఆర్ఎస్ పార్టీ కార్యాలయన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
మండలానికి ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ నిర్ణయించడం పట్ల అభినందనలు తెలిపారు.రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల రక్షణకు అనేక పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు.
ఎమ్మెల్యే రమేష్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారని కొనియాడారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం రైతుల పొట్ట కొట్టి కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తుందని విమర్శించారు.